: తన వయసెంతో స్వయంగా చెప్పిన రమ్యకృష్ణ!


రమ్యకృష్ణ... దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ, ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేని పేరు. 1985లో మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె వయసెంత? గూగుల్ లో వెతికితే, వికీ పీడియాలో రమ్యకృష్ణ వయసు 46 సంవత్సరాలని తెలుస్తోంది. కానీ ఇది తప్పట. ఈ విషయాన్ని రమ్యకృష్ణే స్వయంగా చెప్పింది. భర్త కృష్ణవంశీ, కుమారుడు రిత్విక్ లతో కలసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రమ్య, తనికిప్పుడు 50 సంవత్సరాలని వెల్లడించింది. ఇప్పటికీ వన్నె తరగని గ్లామర్ తో కనిపించే రమ్యకృష్ణకు 50 ఏళ్లు వచ్చేశాయంటే నమ్మలేకపోతున్నామంటున్నారు సగటు సినీ అభిమానులు.

  • Loading...

More Telugu News