: కోహ్లీ అసాధారణ ఆటగాడు.. నా ఫేవరెట్ కెప్టెన్లలో అతనొకడు: గంగూలీ కితాబు


తన ఫేవరెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడంటూ టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కితాబిచ్చాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడని పేర్కొన్న ‘దాదా’ అతి తక్కువ సమయంలోనే దేశానికి ఎన్నో అద్భుతాలు అందించాడని కొనియాడాడు. మైదానంలో పోరాట స్ఫూర్తితో కనిపించే కోహ్లీ భారత్ క్రికెట్ విలువను అమాంతం పెంచేశాడని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి కోహ్లీ అంటూ ఆకాశానికెత్తేశాడు. విజయకాంక్షతో రగిలిపోయే విరాట్ దేశానికి ఎంతో అవసరమైన క్రికెటర్ అని గంగూలీ పేర్కొన్నాడు. ఈ నెలలో మొదలుకానున్న భారత్-కివీస్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఇంగ్లండ్ తర్వాత న్యూజిలాండ్ జట్టే రెండో అత్యుత్తమమైన జట్టని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కంటే స్పిన్నర్లను బాగా ఎదుర్కొనే కివీస్‌తో జాగ్రత్తగా ఉండాలని టీమిండియాను హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News