: భారీ వర్షాలతో గోదావరికి తిరిగొచ్చిన వరద!
మహారాష్ట్రలోని గోదావరి నది క్యాచ్ మెంట్ ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మరోసారి వరద మొదలైంది. భద్రాచలం వద్ద 32.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. సాయంత్రానికి 37 నుంచి 38 అడుగులకు ఇది పెరగవచ్చని అంచనా. మరోవైపు తాలిపేరు, కిన్నెరసాని, పాములేరు నదులు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో ధవళేశ్వరం దిగువన ఉండే లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నీరు సాయంత్రానికి రాజమండ్రికి చేరుతుందని, వచ్చిన వరద నీటిని వచ్చినట్టు సముద్రంలోకి వదులుతామని అధికారులు తెలిపారు.