: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. సునామీ భయం లేదు


అండమాన్ నికోబార్ దీవుల్లో రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతతో ఈరోజు తెల్ల‌వారుజామున భూకంపం సంభవించిన‌ట్లు జాతీయ భూకంప ప‌రిశోధ‌న సంస్థ పేర్కొంది. భూకంపం కార‌ణంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జ‌రిగిన‌ట్లు త‌మ వ‌ద్ద‌ సమాచారం లేదని తెలిపింది. భూకంపంతో సునామీ సంభ‌వించే అవ‌కాశాలు కూడా లేవని పేర్కొంది. భూకంపం ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు వ‌చ్చిన‌ట్లు చెప్పింది. తాము భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News