: విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సు ప్రారంభం
విశాఖపట్నంలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల పట్టణాభివృద్ధి మంత్రుల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సును కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి అమర్‌సిన్హా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా హాజరయ్యారు. సమావేశంలో ప్రతినిధులు పలు అంశాలపై ప్రసంగిస్తున్నారు.