: ‘నవరస నట తిలకం’ బిరుదు అందుకోనుండడం నా అదృష్టం: సినీనటుడు మోహన్‌బాబు
ఈనెల 17న సినీనటుడు మోహన్‌బాబుకు ‘నవరస నట తిలకం’ బిరుదును ప్రదానం చేయనున్నారు. కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మోహన్‌బాబును ఈ బిరుదుతో సత్కరించనున్నారు. విశాఖపట్నంలోని టీఎస్ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ... తనకు ఈ బిరుదు ప్రదానం చేయనున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సినీ ప్రపంచం అంతా ఈ కార్యక్రమానికి తరలివస్తుందని, అందరి మధ్య ఈ బిరుదు అందుకోవడం తన అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ తదితరులు హాజరుకానున్నట్లు సుబ్బరామిరెడ్డి మీడియాకు చెప్పారు.