: ఇండియాలో ఐఫోన్ల ముందస్తు బుకింగ్ ప్రారంభం... రూ. 5 వేలు కట్టాలి!
యాపిల్ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్ల ముందస్తు బుకింగ్ బుధవారం నుంచి ఇండియాలో ప్రారంభమైంది. ఇండియాలో యాపిల్ కు ప్రీమియం భాగస్వామిగా ఉన్న యునికార్న్, ఈ బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఈ ఫోన్లు కొనాలని భావించిన వారు రూ. 5 వేలను అడ్వాన్స్ గా డిపాజిట్ చేసి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి ఈ ఫోన్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. కాగా, ఇండియాలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ రిటైల్ స్టోర్స్ గా ఉన్న టాటా గ్రూప్ క్రోమా, రిలయన్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో మాత్రం ఐఫోన్ల ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాలేదు. తొలి దశలో 28 దేశాల్లో సెప్టెంబర్ 16 నుంచి, ఆపై 23 నుంచి మరో 25 దేశాల్లో ఐఫోన్లు విడుదల కానుండగా, ఆపై రెండు వారాల తరువాత మూడవ దశలో ఇండియాకు ఫోన్ల తొలి బ్యాచ్ రానుంది. 7 మోడల్ లో 32 జీబీ వర్షన్ ధరను రూ. 60 వేలు పెట్టి కొనుక్కోవాల్సి వుంటుంది.