: 'అచ్చే దిన్' స్లోగన్ మాది కాదు, కాంగ్రెస్ దే, ఆ రోజులు మాత్రం ఎన్నటికీ రావు: నితిన్ గడ్కరీ


ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పదేపదే వినిపించే 'అచ్చే దిన్' స్లోగన్ తమది కాదని, దాన్ని తొలిసారిగా వినిపించింది కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడిన ఆయన, "మన్మోహన్ సింగ్ 'అచ్చే దిన్ ఆయేంగే' (మంచి రోజులు వస్తాయి) అన్నారు. ఎప్పుడొస్తాయని ప్రశ్నిస్తే, భవిష్యత్తులో వస్తాయని చెప్పారు. మోదీ వచ్చిన తరవాతే మంచి రోజులు రావడం మొదలైంది. ఆ స్లోగన్ మాకో మైలురాయి అయింది. ఈ స్లోగన్ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం. అయితే మంచి రోజులు ఎప్పటికీ రావు. ఉదాహరణకు సైకిల్ ఉన్న వ్యక్తి, మోటార్ సైకిల్ కోరుకుంటాడు. మోటార్ సైకిల్ లభిస్తే, తదుపరి అతని లక్ష్యం కారు అవుతుంది. కాబట్టి, మంచి రోజులు వచ్చాయని, ఇక చాలని ఎవరూ అనుకోరు" అన్నారు. సుపరిపాలనతో ముందుకు సాగుతూ ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

  • Loading...

More Telugu News