: కల్వకుర్తిలో కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి నిరాహార దీక్ష
తెలంగాణలో జిల్లాల వర్గీకరణ, డివిజన్ల ఏర్పాటు ఆందోళణలకు కారణమవుతోంది. ఇప్పటికే గద్వాల, జనగామలను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి బాటలో మరో కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి కూడా పయనిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక డివిజన్ కోసం నిరాహార దీక్షకు దిగనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిని డివిజన్ గా చేయాలంటూ ఆయన కల్వకుర్తిలో నిరాహార దీక్షకు దిగుతున్నారు.