: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పడమా?: డీజీపీకి కేటీఆర్ ట్వీట్


ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే రూరల్ లో ఉన్న ప్రజలను ఆందోళనకు గురిచెయ్యడమా? వారిపై దాడికి దిగడమా? అని తెలంగాణ పంచాయతీ రాజ్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ డీజీపీ అనురాగ్ శర్మను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీజీపీ రంగారెడ్డి జిల్లా మంచాల ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ పై చర్యలకు సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా మంచాలలో రెండు రోజుల క్రితం ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ సంస్థ బైక్‌ ర్యాలీని చేపట్టింది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ ఎస్సై గంగాధర్‌ నిర్వాహకులను, అందులో పాల్గొన్న వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించిన వారిపై దాడికి దిగారు. వెంటనే జరిగిన ఘటనను నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి డీజీపీని ట్విట్టర్ ద్వారా నిలదీశారు. వెంటనే ఆయన రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ను చర్యలకు ఆదేశించడంతో, సత్వరమే స్పందించిన డీజీపీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News