: లైట్లు ఆఫ్ చేసి జ్యూస్ తాగండి, మీకు మందు తాగిన ఫీలింగే కల్గుతుంది: నితీశ్ కుమార్


‘లైట్లు ఆఫ్ చేసి జ్యూస్ తాగండి. మీకు మందు తాగిన ఫీలింగే కల్గుతుంది’ అంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ చమత్కారంతో కూడిన సలహా ఒకటి మందుబాబులకు ఇచ్చారు. తమ రాష్ట్రంలో మద్య నిషేధంపై ఆయన మాట్లాడుతూ, మందు తాగాలనుకునే వారిని ఉద్దేశించి ఆయన అలా అన్నారు. గతంలో మద్య నిషేధం అమలు చేయలేకపోయానని, ఈసారి తాను సాధించానని, తనకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉందని అన్నారు. మద్యం తాగి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News