: నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ప్రెషర్ కుక్కర్ బాంబులు పేల్చింది వాళ్లేనట!
నెల్లూరు ప్రధాన పట్టణంలోని జిల్లా కోర్టులో ఆవరణలో నిన్న ప్రెషర్ కుక్కర్ బాంబులు పేలిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ పేలుళ్ల వెనుక గతంలో కేరళ, పాండేచ్ఛేరి, చిత్తూరు జిల్లా కోర్టుల్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన అల్ ఉమా తీవ్రవాద సంస్థ ఉందని వారు తేల్చారు. ఈ తీవ్రవాద సంస్థ కోర్టుల్లో బాంబులు పేల్చి, భయబ్రాంతులను చేస్తుందని వారు తెలిపారు.