: ఇది స్విస్ ఛాలెంజా? చంద్రబాబుగారి సూట్ కేసు ఛాలెంజా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి


ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు ఎక్కడా పబ్లిక్ ఇంట్రస్టు లేదని, ఆయనకు ఉన్నదంతా ప్రైవేట్ ఇంట్రస్టేనని ఆరోపించారు. ‘ఇది స్విస్ ఛాలెంజా, చంద్రబాబుగారి సూట్ కేసు ఛాలెంజా, చెప్పాలి?’ అని ఆయన ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి లోపభూయిష్టమని కేల్కర్ కమిటీ చెప్పినా కేంద్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతే లోపభూయిష్టం కాగా, దీనికితోడు నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News