: ఏపీ అంశాలపై వివిధ మంత్రులతో వెంకయ్యనాయుడు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రతి శాఖ నుంచి చేస్తున్న, చేయాల్సిన అంశాలపై ఆయన అధికారులను అడిగారు. ఇందులో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, పియూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రాజధాని అనుసంధానానికి రోడ్ల నిర్మాణంపై గతంలో నితిన్ గడ్కరీ ఇచ్చిన వాగ్దానాలు ఎంత వరకు వచ్చాయని ఆయన అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడుకి హామీ ఇచ్చారు. ఏపీలో స్థాపించనున్న రక్షణ సంబంధిత ప్రాజెక్టుల్లో భాగంగా నిమ్మకూరులో బీఈఎల్ కేంద్రానికి అనుమతి ఇచ్చామని, త్వరలో శంకుస్థాపన చేయాలని వెంకయ్యకు, ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించామని పారికర్ తెలిపారు. ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యేక సాయం అందించాలని వెంకయ్య నాయుడు, అమిత్ షాను కోరారు.