: ఈ ముగ్గురు మహిళలు ‘మోస్ట్ పవర్ ఫుల్’
ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్, ఎస్ బీఐ బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య, యాక్సిక్ బ్యాంకు సీఈవో శిఖర్ శర్మ మనదేశంలోని మూడు ప్రధాన బ్యాంకుల పగ్గాలను నిర్వహిస్తున్న ఈ మహిళామణులు. అమెరికా వెలుపల అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల్లో వీరు చోటు సంపాదించారు. ఫార్చూన్ సంస్థ ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘50 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇంటర్నేషనల్’ జాబితాలో భట్టాచార్య రెండో స్థానంలో ఉండగా, కొచ్చర్ 5వ స్థానంలో, శిఖర్ శర్మ 19 స్థానంలో ఉన్నారు. యూరోజోన్ కు చెందిన అతిపెద్ద బ్యాంకు బ్యాంకో శాంటండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాట్ ఏ ఎన్ తొలి స్థానంలో ఉన్నారు. మూడేళ్ల పదవీ కాలంలో భట్టాచార్య ప్రొఫైల్ మెరుగైనట్టు ఫార్చూన్ సంస్థ పేర్కొంది.