: తెలంగాణ ప్రభుత్వం మా భూమిని కబ్జా చేసింది.. ఆ పత్రాలు ఇవిగో: ఎంపీ గీత
తెలంగాణ సర్కారు తమ భూమిని కబ్జా చేసిందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలు తనవద్దే ఉన్నాయంటూ మీడియాకు చూపించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, టీఎస్ఐసీసీ ఎండీ నరసింహారెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమవారం ఆమె తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లడిన ఎంపీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. వారు తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.