: అద్భుత ఆవిష్కరణ...తెరవాల్సిన పని లేకుండా పుస్తకం చదివేయొచ్చు


అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ పరిశోధకుల బృందం ఓ యంత్రాన్ని కనిపెట్టింది. ఈ యంత్రం పుస్తకం తెరవకుండానే చదవగలుగుతుంది. ఇలా సుమారు 9 పేజీలను ఈ యంత్రం చదవగలదు. దీంతో పురావస్తు తవ్వకాలు, ఎంతోకాలంగా తెరవకుండా వదిలేసిన పుస్తకాల్లో ఏముందో ఇట్టే చదివేసే అవకాశం ఉంది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ లోని ఓ లైబ్రరీలో ఇప్పటి వరకు ముట్టుకోని పుస్తకాలను చదివేయొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఈ యంత్రాన్ని ఆవిష్కరించిన బృందంలో భారత సంతతి వ్యక్తి కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News