: టర్కీలో మరోసారి కారు బాంబు పేలుడు
గతనెల టర్కీలోని గజియాంటెప్‌లో ఓ వివాహ వేడుకలో ఉగ్రవాదులు దాడి జరిపి 50 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఘటన మరవకముందే ఈరోజు ఆ దేశంలో మరోసారి దుండగులు దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు. వాన్ నగరంలోని అధికారిక ఏకే పార్టీ ఆఫీసు వద్ద, గవర్నర్ ఆఫీసు సమీపంలో బాంబు పేలుడు చోటుచేసుకోవడంతో 27 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దాడికి పాల్పడింది కుర్దిష్ మిలిటెంట్లేనని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.