: '200 కోట్లిస్తా' అంటే... 'వద్దు, నా బాధలేవో నేను పడతాను' అన్న పవన్ కల్యాణ్?
200 కోట్ల రూపాయలు ఇస్తాను... ఈ సంస్థను నడిపించు అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. కానీ సినీ నటుడు పవన్ కల్యాణ్ మాత్రం విభిన్నం. ఆయన గురించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాకినాడలో జరిగిన జనసేన సభలో 'సినిమాలు మానేస్తే...నా దగ్గర డబ్బుల్లేవు, మీరే నన్ను పోషించాలి, నన్ను సినిమాలు మానేయమంటారా?' అంటూ పవన్ కల్యాణ్ అభిమానులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పవన్ కల్యాణ్ కు 200 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చాడట. '200 కోట్ల రూపాయలు ఇస్తాను... పార్టీని నువ్వే నడిపించు' అంటూ ఆయన రాయబారం పంపాడట. ఈ కళ్లు తిరిగే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన పవన్ కల్యాణ్... 'ఎంత కష్టమైనా సరే, డబ్బుల్లేకున్నా సరే, కష్టార్జితంతోనే పార్టీని నిర్మిస్తాను, నడిపిస్తానని తెలిపాడట. ఇది ప్రాక్టికల్ గా చాలా కష్టమని తనకు తెలుసని, అయితే తాను నమ్ముకున్న విలువలతోనే పార్టీని నడిపిస్తా'నని పవన్ కల్యాణ్ ఆయనకు సమాధానమిచ్చాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ సభలో అభిమాని మరణించగానే సభలు పెట్టనని ప్రకటించేశాడని, అయితే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తాడో చూడాలని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు.