: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడు
నెల్లూరు పట్టణంలోని జిల్లా కోర్టుల సముదాయం వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది. రెండు రోజుల సెలవుల తరువాత తెరుచుకున్న జిల్లా కోర్టు ఆవరణలో అంతా బిజీగా ఉన్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు, కక్షిదారులు, న్యాయవాదుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి, పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేలుడు ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పేలుడుకి గల కారణాలు, పేలుడుకి పాల్పడిన వ్యక్తులు తదితర విషయాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.