: చంద్రబాబుకు వయసు ముదరడం వల్లే రకరకాల ప్రకటనలు చేస్తున్నారు: సీపీఐ రామకృష్ణ


ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఆ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తున్నారని, బాబుకు వయసు ముదరడం వల్లే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, హోదా ఏమన్నా సంజీవనా? అని మరోసారి, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో తన రక్తం మరుగుతోందని ఇంకోసారి ప్రకటనలు చేశారని అన్నారు. ఇటువంటి ప్రకటనలతో ప్రజలను మోసం చేయడం తప్పా, మరేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై కూడా ఆయన మండిపడ్డారు. బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద తమ నిరసనలు వ్యక్తం చేస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News