: హైదరాబాద్ మీర్ పేట్ లో భారీ చోరీ


హైదరాబాద్ మీర్ పేట్ లో భారీ చోరీ జరిగింది. గుర్రంగూడ రాజ్యలక్ష్మి నగర్ లో నివాసముంటున్న దామోదర్ రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.30 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారం దోచుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో దామోదర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News