: దగ్గు మందు అక్రమ రవాణా.. భద్రతా దళాల కాల్పుల్లో స్మగ్లర్ మృతి


బంగ్లాదేశ్‌కు దగ్గు సిరప్‌ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను నిలువరించేందుకు బీఎఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ మృతి చెందాడు. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లాలోని ఈ ఘటన చోటుచేసుకుంది. దగ్గు మందును బంగ్లాదేశ్ యువకులు మత్తుమందుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశానికి పెద్దమొత్తంలో దగ్గు సిరప్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న కొందరు యువకులను చౌరి అనంతపూర్ గ్రామం వద్ద గతరాత్రి భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ స్మగ్లర్ మృతి చెందాడు. స్మగ్లర్లను గుర్తించిన అధికారులు వారిని వెంబడించగా వారు సైనికులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో అలోక్ కుమార్ అనే జవానుకు గాయాలయ్యాయి. దీంతో భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో 18 ఏళ్ల దిల్వార్ షేక్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో భయపడిన ఇతర యువకులు అక్కడి నుంచి పరారైనట్టు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News