: ఏపీకి ప్యాకేజీపై ఢిల్లీలో స్పందించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాకుండా తాము ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో ఆయనను బీజేపీ ఏపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాష్ట్రానికి తాము ఇస్తోన్న ప్యాకేజీ వల్ల ఏపీ అభివృద్ధి సాధించడానికి మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నట్లు పీఎంవో తెలిపింది. బీజేపీ ఏపీ నేతలు మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం అమిత్ షాతో కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ద్వారా చేకూరే లాభాలను ప్రజలకి తెలియజెప్పుతామని బీజేపీ ఏపీ నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.