: పవన్ కల్యాణ్ పై నాంపల్లి పీఎస్ లో కంప్లెయింట్!
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాదులోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లెయింట్ దాఖలైంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘సీమాంధ్రుల ఆత్మగౌరవం సభ’ పేరిట నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ... పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.