: డబ్బులెప్పుడూ పాచిపోవు.. మాటలు, భావోద్వేగాలే పాచిపోతాయి!: పవన్ కు బీజేపీ నేత కౌంటర్
నిన్న కాకినాడ సభలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ ఎన్డీఏలో ఉండాలో లేదో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కేంద్రంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. రాజకీయ విమర్శలు చేసే ముందు అధ్యయనం చేయాలని సూచించారు. 'డబ్బులెప్పుడూ పాచిపోవు, మాటలు భావోద్వేగాలే పాచిపోతాయి' అని పవన్‌ను విమర్శించారు. హోదాపై పలువురు నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిద్ధార్థనాథ్ అన్నారు. 'కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీని పవన్ కల్యాణ్ పరిశీలించినట్లులేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. సెంటిమెంట్‌తో ఏపీ అభివృద్ధి సాధ్యం కాదని, కేంద్రం ఇచ్చే నిధులతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.