: రోజుకు 4 జీబీ డేటానే ఇస్తారట!... ‘జియో’ విధివిధానాలలో స్పష్టం!


జియో సిమ్ తీసుకునే వినియోగదారుడికి ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు అపరిమిత డేటాను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఇటీవలే ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కంపెనీ నుంచి విడుదలైన విధివిధానాలు పరిశీలిస్తే ముఖేశ్ అంబానీ ప్రకటన అవాస్తవమని తేలుతోంది. రోజుకు ఒక్కో వినియోగదారుడికి కేవలం 4 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఈ 4 జీబీ డేటా అయిపోగానే కనీసం ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడం కుడా కుదరదట. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ ఉందన్న భావనతో సినిమాలు డౌన్ లోడ్ చేసుకునే వినియోగదారులు జియో సేవలతో మరింత ఇబ్బందులకు గురి కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News