: 9/11 ఇంకా కొన్నివేల సార్లు రిపీటవుతుంది.. అమెరికాను హెచ్చరించిన ఆల్‌ఖాయిదా
అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై సెప్టెంబరు 11,2001లో జరిగిన దాడులు కొన్నివేల సార్లు రిపీటవుతాయని ఆల్‌ఖాయిదా చీఫ్ అయిమన్ అల్-జవహరీ అమెరికాను హెచ్చరించారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ఆల్‌ఖాయిదా ఓ వీడియోను విడుదల చేసింది. గురువారం యూట్యూబ్‌లో ఈ వీడియో హల్‌చల్ చేసింది. ‘‘మాపై మీ నేరాలకు ప్రతీకారంగానే 9/11’’ అని వీడియోలో జవహరీ పేర్కొన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే 9/11 లాంటి ఘటనలు వేలసార్లు చూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిలో 2,753 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులందరూ ఏకం కావాలని కోరిన ఆల్‌ఖాయిదా చీఫ్ ఆఫ్రికన్ అమెరికన్లను ఇస్లాంలోకి మారాల్సిందిగా సూచించాడు. అరబ్, ముస్లిం దేశాలపై అమెరికా విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన జవహరీ, ఆ దేశాల్లోని భూములను ఆక్రమించుకుంటూ నేరపూరిత, లంచగొండి ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఇస్తోందని ఆరోపించాడు.