: పవన్ కల్యాణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను: బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ


ఏపీకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్రోహం చేశారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన ఏపీ కోసం వెంకయ్యనాయుడు ఎంతగా ఢిల్లీలో మంతనాలు జరిపారనే విషయంలో తమకెవ్వరికీ అనుమానాలు లేవన్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ కు ఏమైనా అనుమానాలుంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఉందని సత్యనారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News