: ఢిల్లీలో తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసిన క్రికెటర్ గేల్
ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ స్వీయ చరిత్ర (ఆటోబయోగ్రఫీ) పుస్తక విడుదల కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హజరై, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ, తన ఆటోబయోగ్రపీని చదివితే యువకులు, క్రికెట్ అభిరుచి ఉన్నవారు స్పూర్తి పొందుతారని అన్నాడు. తన బ్యాటింగ్ లాగే ఈ పుస్తకం కూడా వినోదం పంచుతుందని గేల్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా స్పూర్తి కలిగించే వ్యక్తిగా ఉండాలని తాను కోరుకుంటానని గేల్ తెలిపాడు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, క్రిస్ గేల్ లాంటి వ్యక్తులు క్రికెట్ కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్ లని అన్నారు.