: తుది దశకు చేరుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ.. వివరాలు వెబ్‌సైట్లో పెట్టాలని కలెక్టర్లకు తెలంగాణ సీఎస్ ఆదేశం


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన అంశాల‌ను చ‌ర్చించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్‌శర్మ ఈరోజు అధికారుల‌తో కీల‌క భేటీ ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల్లో శాఖల ఏర్పాటు, సిబ్బంది వివరాలపై చ‌ర్చించిన ఆయన.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీజీజీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక, భౌగోళిక, సామాజిక, జనాభా అంశాలు దృష్టిలో ఉంచుకొని వివ‌రాలు న‌మోదు చేయాల‌ని రాజీవ్‌శర్మ సూచించారు. నూత‌న జిల్లాల్లో కావాల్సిన సిబ్బంది ప్ర‌తిపాద‌న‌లు ఆర్థిక శాఖ‌కు ఇవ్వాలని చెప్పారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో వచ్చే దసరా నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఇందు కోసం ఆర్థిక శాఖ‌లో ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News