: ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్‌పై సినీరంగ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ
ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్‌పై సినీరంగ ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈరోజు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో ఈనెల 24 నుంచి 27వరకు ఫిలిం కార్నివాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. సినీరంగ ప్రముఖులతో చర్చించిన తలసాని కార్నివాల్‌పై ఈనెల 13న ఫిలిం ఛాంబర్‌లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 దేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్‌లో 200కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు.