: ‘హోదా’పై సీఎం ప్రకటన చేస్తారన్న యనమల!... నేరుగా చర్చకెళదామన్న వైసీపీ!
ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వరుసగా రెండో రోజు రగడ కొనసాగింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన రెండో రోజు సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మైకందుకోగా... వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా తాము ప్రత్యేక హోదాపై చర్చకు సిద్ధమేనని ప్రకటించిన ఆయన... అయితే అంతకుముందు సీఎం ప్రకటన చేస్తారని ప్రతిపాదించారు. ఇందుకు వెనువెంటనే స్పందించిన విపక్షం సీఎం ప్రకటన అవసరం లేదని, నేరుగా చర్చకే వెళదామంటూ చెప్పింది. దీనికి అధికార పక్షం ససేమిరా అనడంతో విపక్షం ఆందోళనకు దిగింది.