: రెండో రోజూ నల్ల రంగు దుస్తుల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు!... ప్రత్యేక హోదాపై చర్చ జరగాల్సిందేనని పట్టు!


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మాదిరే నల్ల రంగు దుస్తుల్లోనే వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. అదే సమయంలో తొలి రోజు సభ ముందు చేసిన వాదననే వైసీపీ రెండో రోజు కూడా వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాల్సిందేనని వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ తిరస్కరణతో వారంతా సీట్లలో నుంచి లేచి పోడియంను చుట్టుముట్టారు. దీంతో తొలి రోజు మాదిరిగానే, రెండో రోజు సమావేశాల్లోనూ గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News