: సమంతతోనే చైతూ పెళ్లి!... డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం!: కొడుకుల పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన నాగ్!


అక్కినేని నట వారసుల వివాహాలపై సస్పెన్స్ వీడిపోయింది టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య పెళ్లి ప్రముఖ హీరోయిన్ సమంతతో, అతడి తమ్ముడు, మరో యువ హీరో అఖిల్ పెళ్లి శ్రేయా భూపాల్ తో జరగనున్నాయి. ఈ మేరకు వారిద్దరి తండ్రి, టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున నిన్న అధికారికంగా ప్రకటించారు. నిన్న హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లకు సంబంధించి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించారు. తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి అందరూ అనుకుంటున్నట్లుగానే సమంతతోనే జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ పెళ్లి తేదీలను ఇంకా ఖరారు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇక తన చిన్న కొడుకు అఖిత్ అతడు ప్రేమించిన యువతి శ్రేయా భూపాల్ నే పెళ్లాడనున్నాడని చెప్పిన నాగ్... వీరిద్దరి వివాహంలో తొలి అంకం నిశ్చితార్థాన్ని డిసెంబర్ 9న నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం తన కొడుకులిద్దరూ వారి కెరీర్ పై దృష్టి సారించారని చెప్పిన నాగ్... ఇద్దరి పెళ్లిళ్లు మాత్రం ఈ ఏడాదిలో ఉండవని తేల్చిచెప్పారు. ‘‘నా కొడుకులిద్దరూ సంతోషంగా ఉన్నారు. కొడుకులు, కోడళ్లను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా. తండ్రిగా నాకు గర్వపడే క్షణాలు ఇంతకంటే ఏముంటాయి? సమంతను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చైతన్య నాతో చెప్పాడు. అయినా ఇది అందరికీ తెలిసిందేగా. వారు హ్యాపీగా బయటకు కూడా వెళుతున్నారు. వాళ్ల నిర్ణయానికి నేనూ హ్యపీ’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News