: టాలీవుడ్ నిర్మాత కేఎస్ రామారావు అరెస్ట్!... ఆ వెంటనే బెయిల్ పై విడుదల!
టాలీవుడ్ అగ్ర నిర్మాత కేఎస్ రామారావును నిన్న హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వెంటనే బెయిల్ లభించడంతో ఆయన బయటకు వచ్చేశారు. వివరాల్లోకెళితే... ఇటీవల ఫిల్మ్ నగర్ లోని ఫిలింనగర్ క్లబ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ కేసులో ఫిలింనగర్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ రామారావు సహా కార్యదర్శిగా ఉన్న రాజశేఖరరెడ్డిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ వారెంట్లు చేతబట్టుకుని రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో వారిద్దరూ బయటకు వచ్చేశారు.