: అమిత్ షా సభలో విరుచుకుపడ్డ పటీదార్లు.. కుర్చీలు ధ్వంసం
గుజరాత్ లోని సూరత్ లో అమిత్ షా సభలో పటీదార్లు రెచ్చిపోయారు. విద్యా ఉద్యోగాల్లో తమకు కోటా కల్పించాలంటూ నినాదాలు చేశారు. సభలో ఏర్పాటు చేసిన కుర్చీలను, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ లోని పటీదార్ కమ్యూనిటీకి చెందిన మంత్రులను సన్మానించే నిమిత్తం ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు, పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభకు కూడా వారు హాజరై ఈ విధ్వంసానికి పాల్పడ్డారు.