: అదనపు బాధ్యతలు స్వీకరించిన గుజరాత్ గవర్నర్


గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 26వ గవర్నర్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రాజ్ భవన్ లో మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మెనాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. కాగా, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ (89) ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఓపీ కోహ్లీ బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News