: రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి


నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఆర్థిక సాయంపై పాడిన పాటే పాడ‌డంతో ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలతో పాటు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ అంశంపై ఏపీసీసీ అధ్య‌క్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కలిసి ఏపీని మరోసారి మోసం చేశాయ‌ని అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోన్న కేంద్రం తీరుపై నిర‌సన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని జిల్లాల్లో రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఆందోళ‌న‌ల్లో భాగంగా తాము టీడీపీ, బీజేపీ వైఖ‌రిని ఎండగడతామ‌ని పేర్కొన్నారు. తాము రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాల‌ను సాధించే క్ర‌మంలో రాజీ ప‌డ‌బోమ‌ని అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ అమలు కావాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News