: ఆకలితో ఉన్నవారికి మంచినీళ్లు తాగించాలని చంద్రబాబు చూస్తున్నారు: మంత్రి పీతల సుజాత


ఆకలితో ఉన్న రాష్ట్ర ప్రజలకు మంచినీరు తాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, విపక్షాలు దాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నాయని ఏపీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె, కేంద్రం హోదా ఇచ్చే వరకూ పోరాడాలన్నదే తమ ఉద్దేశమని, అంతకన్నా ముందు కేంద్రం నుంచి నిధులు తీసుకోవాలని భావిస్తున్నామని అన్నారు. నిన్న కేంద్రం నుంచి మనకు ఏదైతే ఇస్తున్నామన్న ప్రకటన చేశారో, అవన్నీ స్టేట్ మెంట్ రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. విపక్షాలు రాద్ధాంతం మాని సహకరించాలని హితవు పలికారు. రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాకుండా చూడాలని, హోదా రాకూడదని వారు ప్రయత్నిస్తున్నారని వైకాపాను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News