: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే!... మరికాసేపట్లో భేటీ కానున్న బీఏసీ!
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. కేవలం మూడు రోజుల పాటు మాత్రమే జరిగే ఈ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందుగా ఎజెండాను ఖరారు చేసేందుకు సభా వ్యవహారాల సలహా కమిటీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ- బీఏసీ) సమావేశం కానుంది. సీఎం, విపక్ష నేత, ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉండే ఈ సమావేశం మరికాసేపట్లో(8.30 గంటలకు) స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన భేటీ కానుంది. కనీసం మూడు వారాల పాటు సమావేశాలను నిర్వహించాలని విపక్ష వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీఏసీ భేటీలోనే అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఈ భేటీ ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.