: ఏపీకి ‘ప్యాకేజీ’ విలువ రూ.1.5 లక్షల కోట్లట!
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిన్న చావు కబురు చల్లగానే చెప్పేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకున్నా... ప్రత్యేక హోదాతో ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో అంతే స్థాయిలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆయన నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో ఆయా అంశాలపై నిధుల లెక్క కాకుండా... వివరణ మాత్రమే ఇస్తూ జైట్లీ ప్రకటన సాగిపోయింది. ఈ క్రమంలో ప్రత్యేక ప్యాకేజీ కింద ఏ పద్దు ద్వారా ఎంతమేర లబ్ధి చేకూరనుందన్న విషయాన్ని ఎవరికి వారే లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిధుల వివరాలు సుమారు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజక్టుకు ఇచ్చే నిధులు... రూ.32 వేల కోట్లు ఈఏపీ రుణం ద్వారా అందే నిధులు... రూ.30 వేల కోట్లు మౌలిక సౌకర్యాలకు అందే నిధులు... రూ.25 వేల కోట్లు ఓడరేవుల నిర్మాణానికి ఇచ్చే నిధులు... రూ.20 వేల కోట్లు ఆర్థిక లోటు భర్తీకి అందే నిధులు... రూ.10 వేల కోట్లు అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధులు...రూ. 10 వేల కోట్లు (15 వేల కోట్ల దాకా పెరిగే అవకాశం) కారిడార్ నిర్మాణానికి ఇచ్చే నిధులు... రూ.12 వేల కోట్లు వెనుకబడిన జిల్లాలకు నిధులు... రూ.2 వేల కోట్లు