: భారీ స్కోర్లు నాకు పెద్ద విషయం కాదు...అయితే నన్ను ఓపెనర్ గా పంపాలి: మ్యాక్స్ వెల్


భారీ స్కోర్లు చేయడం తనకు పెద్ద విషయం కాదని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన తోలి టీ20లో రికార్డు స్థాయిలో కేవలం 65 బంతుల్లో 145 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ మాట్లాడుతూ, జట్టు కూర్పులో భాగంగా మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ కు వస్తుంటానని, దీంతో భారీ స్కోర్లు చేసే అవకాశం రావడం లేదని అన్నాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరిగి ఓపెనర్ గా వస్తే భారీ స్కోర్లు చేయడం తనకు పెద్ద విషయం అవదని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ పై బాధ్యత ఉంటుందని, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉండదని అన్నాడు. ఓపెనర్ పై ఒత్తిడి ఉండదని, దీంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని, దీంతో భారీ స్కోర్లు చేయడం సాధ్యమని మ్యాక్స్ వెల్ అన్నాడు.

  • Loading...

More Telugu News