: పీఎంఓకు చేరిన ప్రత్యేక ప్యాకేజ్ ముసాయిదా ప్రతి


ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ముసాయిదా ప్రతిపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ముసాయిదా ప్రతిని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు పంపింది. పీఎంఓ నుంచి స్పష్టత వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, పారిశ్రామిక రాయితీలు మినహా మిగతా అంశాలు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. విశాఖ- చెన్నై కారిడార్ నిధుల ఖర్చు కేంద్ర వాణిజ్య శాఖ భరించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణం, నౌకాశ్రయాల ఖర్చుపై కీలక ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు. ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్ల పాటు రూ.350 కోట్ల నిధుల చొప్పున ప్రకటించే అవకాశముందని సమాచారం. కేంద్రీయ విద్యా సంస్థలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News