: హద్దులు మీరిన శ్రీలంక స్పిన్నర్ సేవనాయకే మ్యాచ్ ఫీజులో కోత
శ్రీలంక స్పిన్నర్ సేవనాయకే మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పడింది. శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ తీసుకున్న సేవనాయకే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన సేవనాయకేపై చర్యలు తీసుకోవాలంటూ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ప్రతిపాదించాడు. దాంతో సేవనాయకే మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ ఐసీసీ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, పల్లెకెలెలో నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా 263 పరుగుల చేయగా, శ్రీలంక 178 పరుగులకే ఆలౌటైంది.