: విహారయాత్రలతో ఎంజాయ్ చేస్తున్న మిస్ట‌ర్ కూల్ ధోనీ


టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్‌, మిస్ట‌ర్ కూల్ ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. వ‌న్డే, టీ20ల్లో మాత్రం సార‌థ్య బాధ్య‌త‌లు మోస్తూ క‌నిపిస్తున్నారు. టీమిండియా టెస్టు క్రికెట్ ఆట‌గాళ్లు క్రికెట్ పోరులో పాల్గొంటున్న స‌మ‌యంలో ఖాళీగా ఉంటోన్న ధోనీ హాయిగా త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విహారయాత్రలకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. త‌న విహారయాత్ర వివ‌రాల‌ను సోష‌ల్‌మీడియా ద్వారా ఎప్పటికప్పుడు త‌న అభిమానుల ముందుంచుతున్నాడు. ఇటీవల త‌న టూర్‌లో భాగంగా ఓ ప్రదేశంలో నది ఒడ్డున సెల్ఫీ దిగిన పోటోని ధోనీ సోష‌ల్‌మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆ ప్ర‌దేశం ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంద‌ని గోల్ఫ్‌ ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News