: ‘గిన్నిస్’ కెక్కిన గాజువాక వినాయకుడి భారీ లడ్డూ


విశాఖపట్టణంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 78 అడుగుల గణేశుడికి భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. తాపేశ్వరానికి చెందిన శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ 29,465 కిలోల లడ్డూను గాజువాక విఘ్నేశ్వరుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఈ లడ్డూ తయారీకి సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేశారు. దీని తయారీకి 20 మంది సభ్యులు దాదాపు 20 గంటలపాటు శ్రమించారు. 45 శాతం చక్కెర, 23 శాతం శనగ పిండి, 27 శాతం నెయ్యి, 5 శాతం డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన ఈ లడ్డూను గాజువాక వినాయకుడికి విశాఖ సంక్షేమ సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ యజమాని మల్లికార్జునరావు మాట్లాడుతూ, తమ సంస్థ తయారు చేసిన భారీ లడ్డూలు ఈ విధంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకోవడం ఇది ఐదోసారని చెప్పారు. ఈరోజు నుంచి ఈ లడ్డూను భక్తులకు పంచిపెడతామన్నారు.

  • Loading...

More Telugu News