: లెన్స్ కార్ట్ లో రహస్య పెట్టుబడి పెట్టిన విప్రో అజీం ప్రేమ్ జీ
ఆన్ లైన్ వ్యాపారం నిర్వహిస్తున్న లెన్స్ కార్ట్ లో విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ పెట్టుబడులు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఇన్వెస్ట్ మెంట్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రేమ్ జీ ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారన్న విషయాన్ని మాత్రం వెల్లడించని విప్రో, ఆ సంస్థ మరింత ఉన్నత స్థితికి చేరుతుందని తమ చీఫ్ నమ్మినట్టు పేర్కొంది. కాగా, గడచిన జూన్ నెలలో లెన్స్ కార్ట్ రూ. 400 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమ్ జీ తమతో కలసి రావడం ఎంతో సంతోషకరమని లెన్స్ కార్ట్ ఫౌండర్ చీఫ్ పీయుష్ బన్సాల్ వెల్లడించారు. మరో ఐదేళ్లలో ఐపీఓకు వెళ్లాలన్న తమ ఆలోచనకు ప్రేమజ్ జీ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వివరించారు. ఆన్ లైన్ వ్యాపారంతో పాటు ఆఫ్ లైన్ వ్యాపారంలోనూ రాణించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.