: ‘ప్యాకేజీ’ పేరు మారింది!... ‘స్సెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ’గా మార్చేసిన రాజ్ నాథ్!


ఏపీకి కేంద్రం నేటి మధ్యాహ్నం ప్రకటిస్తుందని భావిస్తున్న ‘ప్రత్యేక ప్యాకేజీ’ పేరు మారిపోయింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సి.ఎం రమేశ్ లతో భేటీ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి కీలక విషయాలను వెల్లడించారు. ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ పేరును ఆయన ‘స్సెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ’గా పేర్కొన్నారు. దీని కింద ఇచ్చే నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద అందే నిధుల కంటే అధికంగా ఉంటాయని కూడా ఆయన వారికి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News