: లేదు, తెలీదు, నేను కాదు... సీఐడీ ఏం అడిగినా భూమన సమాధానమిదే!


తుని విధ్వంసం కేసులో నిన్న దాదాపు ఆరు గంటల పాటు సీఐడీ విచారణకు హాజరైన వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి నుంచి అధికారులు ఏ విధమైన సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు సీఐడీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ, భూమన నోటి వెంట 'లేదు', 'తెలీదు', 'నేను కాదు' అన్న సమాధానాలే అత్యధికంగా వచ్చాయని, ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రశ్నించాలని ఆయన్ను నేడు కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. రాజకీయ కుట్ర కారణంగానే తుని ఘటనల్లో తనను ఇరికిస్తున్నారని, కాపు నేత ముద్రగడ పద్మనాభంకు తాను మద్దతు పలికానే తప్ప, జరిగిన హింసకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ కేసులో అరెస్ట్ అయిన వారు తనకు తెలీదని, కాపు నేతలకు తాను ఫోన్లు చేయలేదని ఆయన సీఐడీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News